సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు

సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు

ఢిల్లీ : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ ఈవెంట్‌ సంస్ధ నుంచి డబ్బులు తీసుకుని  ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ కు వస్తానని ముందుగానే డబ్బులు తీసుకుని.. కార్యక్రమానికి గైర్హాజరు కాకపోవడంతో నిర్వాహకులు..  సోనాక్షి సహా 5గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోనాక్షి సిన్హా గత ఏడాది సెప్టెంబర్‌ 30న కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ 37 లక్షలు తీసుకున్నారని, అయితే చివరినిమిషంలో ఈవెంట్‌ లో ఆమె పాల్గొనలేదని ఆరోపిస్తూ ఆర్గనైజర్లు ఫిర్యాదు చేయడంతో సోనాక్షి సహా ఐదుగురిపై చీటింగ్‌ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.