నెక్స్ట్ మూవీపైనే జాన్వీ ఆశలు

నెక్స్ట్ మూవీపైనే జాన్వీ ఆశలు

అవకాశాలు వస్తున్నాయి. కానీ అదృష్టమే కలిసి రావడం లేదు జాన్వీ కపూర్‌‌‌‌‌‌‌‌కి. ధడక్, ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, రూహీ చిత్రాల్లో నటించినా చెప్పుకోదగ్గ పేరు రాలేదు జాన్వీకి. దాంతో తన నెక్స్ట్ మూవీ ‘గుడ్‌‌‌‌లక్ జెర్రీ’ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ ఇప్పుడా సినిమా ఓటీటీ బాట పట్టింది. సిద్ధార్థ్‌‌‌‌ సేన్ గుప్తా డైరెక్షన్‌‌‌‌లో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన ఈ మూవీని జులై 29న డిస్నీప్లస్ హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేస్తున్నట్లు నిన్న ప్రకటన వచ్చింది. నయనతార ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌‌‌‌కుమార్ రూపొందించిన తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’కి రీమేక్‌‌‌‌ ఈ సినిమా.

పోయినేడు మార్చ్‌‌‌‌లోనే షూటింగ్ పూర్తైపోయింది. అప్పట్నుంచీ సరైన రిలీజ్ డేట్‌‌‌‌ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. చివరకు డిజిటల్ రిలీజ్‌‌‌‌కి ఫిక్సయ్యారు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఓ అమ్మాయి అనుకోకుండా స్మగ్లర్‌‌‌‌‌‌‌‌గా మారుతుంది. అమాయకంగా కనిపిస్తూనే తెలివిగా డ్రగ్స్‌‌‌‌ని చేతులు మారుస్తుంది. దానివల్ల ఆమెకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని ఎలా ఎదుర్కొంది అనేది మెయిన్ స్టోరీ. నయనతార చేసిన క్యారెక్టర్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ పాత్రని జాన్వీ పోషించడంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. జాన్వీ ఎన్ని మార్కులు వేయించుకుంటుంది, ఈ సినిమాతోనైనా ఆమెకి లక్ దక్కుతుందా అనేది చూడాలి మరి!