
కాఫీ విత్ కరణ్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమర్ రచ్చ చేశాడు. సమంతతో కలిసి ఈ షోలో పాల్గొన్న అక్షయ్..సమంతను ఎత్తుకుని హంగామా చేశాడు. ఊ అంటావా ఊఊ అంటావా పాటకు అక్షయ్ కుమార్, సమంత స్పెప్పులేసి అలరించారు.
కాఫీ విత్ కరణ్లో అక్షయ్ కుమార్.. ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
పాపులారిటీ సర్వేపై కరణ్ అక్షయ్ కుమార్ను ప్రశ్నించగా...యాక్టర్లు అందరూ కష్టపడి పనిచేస్తారని అక్షయ్ కుమార్ చెప్పాడు. అందుకే పాపులారిటీ సంపాదించుకుంటారని వివరించాడు.
మల్టీస్టారర్ సినిమాలపై కూడా అక్షయ్ స్పందించాడు. సౌత్ లో మల్టీ స్టారర్ సినిమాలు విపరీతమైన క్రేజ్ ఉంటుందని..దాదాపు అన్ని మల్టీ స్టారర్ సినిమాలు హిట్ అయ్యాయన్నాడు. సౌత్ లో అన్ని చిత్ర పరిశ్రమల్లో నటించిన ఇద్దరి హీరోల సినిమాలను ప్రేక్షకులు ఆదరించారని చెప్పాడు. కానీ బాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలంటే భయపడతారని చెప్పుకొచ్చాడు. హీరోలు వీటిపై ఇంట్రస్ట్ చూపించడం లేదని వివరించాడు. హీరోలు అభద్రతా భావాన్ని వదిలిపెట్టాలని సూచించాడు. తాను కరణ్ సినిమాలో సెకండ్ హీరోను కావాలనుకుంటున్నట్లు అక్షయ్ తన కోరికను బయటపెట్టాడు. కానీ ఇప్పటి వరకు ఆ ఛాన్స్ ను పొందలేకపోతున్నట్లు అక్షయ్ వివరించాడు.
జానీ దుష్మన్ వల్ల ఇంటివాడయ్యా..
కెరియర్ మొదట్లో తనకు ఇళ్లు ఉండేది కాదని అక్షయ్ కుమార్ తెలిపాడు. అయితే జానీ దుష్మన్ సినిమా వల్ల ఇంటివాడయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తనకు ఇళ్లు కట్టుకోవడానికి భూమి, మనీ ఇచ్చిందన్నాడు. ఇప్పుడు తాను ఉంటున్న ఇళ్లు జానీ దుష్మన్ సినిమా వల్లే వచ్చిందని పేర్కొన్నాడు.
ట్రోల్స్ ను పట్టించుకోను..
కెనడియన్ కుమార్ అనే విమర్శలపై కూడా అక్షయ్ స్పందించాడు. తనపై సోషల్ మీడియాలో కెనడియన్ కుమార్ అంటూ ట్రోల్ చేస్తారని..వాటిని తాను పట్టించుకోనన్నాడు. గతంలో కెనడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసిన తర్వాత 2019లో లోక్ సభ ఎన్నికల్లో ఓటే వేయనందుకు ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే వాటిని తాను అస్సలు పట్టించుకోనని పేర్కొన్నాడు. కెనడియన్ కుమార్ అని పిలిచే వాళ్లను పిలవనీవ్వండి అని లైట్ తీసుకున్నాడు.
అటు తన సినిమాల్లో చిన్న నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఇబ్బంది పడుతున్నారని అని కరణ్ ప్రశ్నించగా..అదేం లేదని బదులిచ్చాడు. మీరు అసూయతో ఉన్నారని కరణ్ పై జోక్ వేశాడు. తాను ఎందుకు వారితో నటించకూడదన్నాడు. వారితో కలిసి తాను నటిస్తానని..అది ఎంతో ఆనందాన్నిస్తుందని అక్షయ్ చెప్పుకొచ్చాడు. తాను 55 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నానని అని అంటూ కరణ్ ను ప్రశ్నించాడు.