అక్టోబర్ 16న టైగర్ ట్రైలర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్

 అక్టోబర్ 16న టైగర్ ట్రైలర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు లీడ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘టైగర్ 3’ ఒకటి. గతంలో ఈ ప్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బస్టర్‌‌‌‌ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

ఈ మూడో భాగానికి మనీశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌ సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా ట్రైలర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్టోబర్ 16న ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సల్మాన్ యాక్షన్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

మొదటి రెండు చిత్రాల్లో హీరోయిన్‌‌గా నటించిన కత్రినా కైఫ్‌‌.. ఇందులోనూ హీరోయిన్‌‌గా నటిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో చేయని, చూడని యాక్షన్ సీక్వెన్సులు ఇందులో ఉంటాయని సల్మాన్ అన్నారు.