శ్రీదేవితో..బోనీ కపూర్ ఫస్ట్ టైం దిగిన ఫొటో

శ్రీదేవితో..బోనీ కపూర్  ఫస్ట్ టైం దిగిన ఫొటో

బాలీవుడ్ నటుడు బోనీ కపూర్, తన భార్య, దివంగత నటి శ్రీదేవితో ఫస్ట్ టైం దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో బోనీ కపూర్, శ్రీదేవీ నవ్వుతూ, ఫొటోకు ఫోజిస్తూ కనిపిస్తున్నారు. ఈ పిక్ తో పాటు ఇది 1984లో శ్రీదేవీతో దిగిన మొదటి ఫొటో అనే క్యాప్షన్ ను కూడా జోడించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలురకాలు కామెంట్లు పెడుతున్నారు.  అంతకు ముందు శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె అద్భుతమైన పెయింటింగ్ లాంటి ఫొటోను బోన్ కపూర్ పంచుకున్నారు. ఆమె తమ నుండి వెళ్లిపోయి ఐదేళ్లయినా ఇప్పటికీ ఆమె పంచిన ప్రేమ, జ్ఞాపకాలు తమతో ఉన్నాయని పోస్టులో రాసుకొచ్చారు. ఇక 2018లో దుబాయ్ లో కుటుంబ వివాహానికి హాజరైన శ్రీదేవి.. అక్కడే తుది శ్వాస విడిచారు. కాగా ఆమె ఎన్నో తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి, ఎవర్ గ్రీన్ యాక్ర్టెస్ గా పేరు తెచ్చుకున్నారు.