బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ లేపిన KGF-2

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ లేపిన KGF-2

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా 2022లో బాలీవుడ్ లో చాలా సినిమాలు విఫలమయ్యాయి. అమీర్ ఖాన్, రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయారు. 2022  జనవరి నుంచి నవంబర్ నెల వరకు బాలీవుడ్ బాక్సాఫీస్‭కు రూ.9,751 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 

ఇందులో ఈ ఏడాది టాప్ 10 సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో కేజీఎఫ్ 2, సెకండ్ ప్లేసులో ఆర్ఆర్ఆర్ ఉండటం విశేషం. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద  KGF చాప్టర్ 2 రూ.434.70 కోట్లు.. ఆర్ఆర్ఆర్ రూ.274.31 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 

ఇక తర్వాతి స్థానంలో బ్రహ్మస్త్ర పార్ట్ వన్ రూ.257.44 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్ రూ.252.90 కోట్లు. అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 2 రూ.227.94 కోట్లు, కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా2  రూ.185.92 కోట్లు, ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి రూ.129.10 కోట్లు వసూలు చేసింది.