సీఎం అంటే కటింగ్ మాస్టరా.? రుణమాఫీ నిధులు ఎందుకు తగ్గిస్తున్నరు: కేటీఆర్

సీఎం అంటే కటింగ్ మాస్టరా.? రుణమాఫీ నిధులు ఎందుకు తగ్గిస్తున్నరు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ‘సీఎం అంటే కటింగ్ మాస్టరా’ అని రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ‘‘ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా? 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నరు. మొదట రూ.39వేల కోట్లు అని, ఇప్పుడు రూ.31వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు. 

పాస్​బుక్స్ లేవనే నెపంతో, లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం. రేషన్ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండి చెయ్యిచ్చే కుట్ర చేస్తే ఊరుకోం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి మొండి చేయి చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఉండం. మొన్న.. లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు.. రూ.2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొడ్తామంటే కుదరదు’’అని కేటీఆర్ పేర్కొన్నారు.