ప్రజల అంచనాలకు తగ్గట్లే కేంద్ర బడ్జెట్

ప్రజల అంచనాలకు తగ్గట్లే కేంద్ర బడ్జెట్

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెంట్రల్ బడ్జెట్ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మరికొద్ది సేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఠాకూర్ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకొన్నాయి. దేశ ఎకానమీని పెంచే దిశగా, ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని ఠాకూర్ చెప్పారు. ‘ప్రజల అంచనాలకు తగ్గట్లుగా బడ్జెట్‌‌ ఉంటుంది. సబ్‌‌కా సాత్, సబ్‌‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ప్రధాన ఎజెండాగా.. అందరి క్షేమం, శ్రేయస్సులే ధ్యేయంగా మోడీ గవర్నమెంట్ పని చేస్తోంది. ఈ దిశగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది. తద్వారా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులను అధిగమించడంతోపాటు దేశ ఎకానమీని తిరిగి గాడిన ఎక్కించేందుకు క‌ృషి చేస్తున్నాం’ అని ఠాకూర్ పేర్కొన్నారు.