
డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ.. ఓ వైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గానూ దూసుకెళ్తున్నాడు సత్యదేవ్. రీసెంట్‌గా గాడ్ ఫాదర్, రామ్ సేతు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘ఫుల్ బాటిల్’ ఒకటి. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం నుంచి సత్యదేవ్ ఫస్ట్ లుక్‌తో పాటు తన పాత్రను పరిచయం చేశారు. ‘మాసీయెస్ట్, క్రేజీయెస్ట్ మెర్క్యురి సూరి.. పాదరసం లాంటి మనిషి’ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆల్ట్రా మోడర్న్ హెయిర్ కట్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు సత్య. స్టార్ షేప్‌లో ఉన్న కూలింగ్ గ్లాసెస్, చెవికి రింగు పెట్టుకుని, రెండు చేతులతో రెండు మందు గ్లాసులు పట్టుకున్నాడు. గతంలో ఎప్పుడూ లేనంత ట్రెండీ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. చుట్టూ బ్యాక్‌గ్రౌండ్‌లో కాకినాడ పోర్ట్ లైట్ హౌస్, రెండు ఫుల్ బాటిల్స్, కోళ్లు, చేపలు, పైన ఓ ఆటో, కింద రెండు మైకులతో సరికొత్తగా డిజైన్ చేశారు పోస్టర్. సంజన ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ డీ కంపెనీతో కలిసి రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు.