సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం: రాజ్‌నాథ్‌

సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: ఎల్‌వోసీ వద్ద పరిస్థితులను తెలుసుకోవడంలో భాగంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ లడఖ్‌కు సెక్యూరిటీ​ విజిట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు ప్రతిష్ఠంభనపై చైనాతో చర్చలు పురోగమిస్తున్నాయి కానీ అవి ఎంతవరకు పరిష్కరింపబడతాయనే దానిపై తాను హామీ ఇవ్వలేనన్నారు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలనని.. ఇండియా భూభాగంలో నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా ప్రపంచంలోని ఏ శక్తీ ముట్టుకోనీయకుండా కాపాడతామన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం కంటే మంచి మార్గం మరొకటి లేదన్నారు.

‘మీరు దేన్నయినా సహించగలరు. కానీ ఆత్మ గౌరవాన్ని భంగపరిస్తే మాత్రం ఊరుకోరు. అన్నింటి కంటే దేశ గౌరవం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఎవరైనా మా సరిహద్దుల వైపు కన్నెత్తి చూసే సాహసం చేసినప్పుడు మాలోని దేశ ఆత్మ గౌరవం వెంటనే మేల్కొంటుంది’ అని రాజ్‌నాత్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా సైనిక దళాలను ప్రోత్సహించిన రాజ్‌నాథ్.. శత్రువలకు దీటుగా బదులివ్వాలని చెప్పారు.