వరుసగా ఢీకొన్నాయి: రేసులో నిప్పులు చెలరేగిన కార్లు

వరుసగా ఢీకొన్నాయి: రేసులో నిప్పులు చెలరేగిన కార్లు

ఫ్లోరిడా: అదో కార్  రేస్. ఒకదాని  వెనక  మరొకటి…ఇలా  బోలేడన్నీ  కార్లు..సడెన్ గా  మధ్యలో  ఓ కారు  అడ్డం తిరిగింది.  ఇంకేముంది… వెనకే  వస్తున్న  కార్లన్నీ ఢీకొన్నాయి.  ఒకటి కాదు    రెండు కాదు….ఏకంగా  21 రేస్  కార్లు..  నిప్పుల్ని రాజేస్తూ.. ఢీకొట్టాయి. అమెరికాలోని   ఫ్లోరిడాలో ….నాస్కార్  డేటోనా- 500 కార్ల  రేసులో  ఈ యాక్సిడెంట్  జరిగింది. పాల్మినాడ్‌ అనే రేసర్‌ మరో కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కార్లు ఢీకొన్నాయి. రేసులో భాగంగా ఆఖరి 20 ల్యాప్‌ లలో 5 సార్లు ఢీకొనగా.. రెండు సార్లు రేసును నిలిపివేయాల్సి వచ్చింది. 14 మంది రేసర్లు మాత్రమే రేస్‌ ను పూర్తి చేయగలిగారు.