ములుగు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఏటూరునాగారం -తాడ్వాయి మధ్య ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. భారీ ఈదురుగాలులతో రహదారులపై చెట్లు పడిపోయాయి. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. జేసీపీ సాయంతో చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు.
మరో వైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ తో పాటు జగిత్యాల,కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు,నాగర్ కర్నూలు,నల్గొండ,రంగారెడ్డి, సంగారెడ్డి,సిద్దిపేట,వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో తేలికపాటి వర్షానికి చాన్స ఉంది.
హైదరాబాద్ లో మార్చి 30న రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. టోలీ చౌకీ, నాంపల్లి,మలక్ పేట, ఆసిఫ్ నగర్, కార్వాన్, గోషామహల్,మెహదీపట్నం, చార్మినార్, అత్తాపూర్ ,మసాబ్ ట్యాంక్,కూకట్ పల్లికి అలర్ట్ జారీ చేసింది. ఖైరతాబాద్,అబిడ్స్ ,సికింద్రాబాద్,ఉప్పల్, ఎల్బీనగర్, చార్మినార్ ,కంటోన్మెంట్ ,కాప్రా,మల్కాజ్ గిరిలో తేలికపాటి మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
