తాడ్వాయి, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్(ఢిల్లీ), యూనిసెఫ్ ప్రతినిధులు గురువారం మేడారంలో పర్యటించారు.
ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు డాక్టర్ నితీష్ కన్నా, అనుకేట్, తెలంగాణ రాష్ట్ర కన్సల్టెంట్ శ్రీహరి ముందుగా సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం మేడారంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్, జంపన్న వాగు, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.
పారిశుధ్య మౌలిక వసతుల నిర్వహణ, నిర్వహణ వ్యయాలు, భవిష్యత్ నిధుల అవసరాలను అంచనా వేసిన బృందం.. మేడారంలో పారిశుధ్య సేవలను మరింత మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఈ కార్యక్రమంలో మేడారం సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, ఎంపీడీవో రంగుబొట్ల తేజ, పంచాయతీ కార్యదర్శి శరత్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
