ఏషియన్ గేమ్స్ 2026 లో ఇండియా చరిత్ర సృష్టించింది. కబడ్డీ ఫైనల్ లో ఇరాన్ ను చిత్తు చేసి గోల్డ్ మెడల్ సాధించింది. 2026 సెప్టెంబర్ 26వ తేదీన జరిగిన ఫైనల్ లో భారత మహిళల జట్టు.. మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ ఇరాన్ ను మట్టి కరిపించింది.
ఇండియన్ వుమెన్ టీమ్ 37-34 తేడాతో ఇరాన్ ను ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్ లో ఇండియా వుమెన్ జట్టుకు ఇది మూడో బంగారు పతకం.
మ్యాచ్ హాఫ్ టైమ్ లో 22-16 లీడ్ సాధించిన ఇండియా.. ఆ తర్వాత ఇరాన్ పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. సెకండ్ హాఫ్ లో 18-15 లీడ్ తో ఇరాన్ ఆధిపత్యం సాధించింది. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ లీడ్ ఇండియాకు కలిసివచ్చింది.
