పాలేరు రిజర్వాయర్ వరద నీటిని చెరువులకు మళ్లించాలి

పాలేరు రిజర్వాయర్ వరద నీటిని చెరువులకు మళ్లించాలి

కూసుమంచి/ ఖమ్మం టౌన్, వెలుగు: ఎగువ ప్రాంతాల నుంచి పాలేరు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు వస్తున్న వరద నీటిని జిల్లాలోని చెరువులకు మళ్లించి వృథా కాకుండా చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయాన్ని పరిశీలించారు.

నీటిమట్టం, కాలువల ద్వారా విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని సమీక్షించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాలువ, పాలేరు పాతకాలువ, భక్తరామదాసు, మంచుకొండ ఎత్తిపోతల పథకాల ద్వారా అవసరమైన ప్రాంతాలకు నీటిని తరలించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కామంచికల్‌‌‌‌‌‌‌‌, కొంగర, ఈశ్వరమాధారం గ్రామాల్లో భూ రీ-సర్వే పనులను పరిశీలించారు.

అంతకుముందు కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్​ప్రమాదకర ప్రాంతాలను సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి, తక్షణ, దీర్ఘకాలిక చర్యలతో సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టి, రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అధికారులను ఆదేశించారు. ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ నుంచి శ్రీశ్రీ సర్కిల్‌‌‌‌‌‌‌‌ వరకు రోడ్‌‌‌‌‌‌‌‌ మార్కింగ్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తిచేయాలని, శ్రీశ్రీ సర్కిల్‌‌‌‌‌‌‌‌ వద్ద క్రిస్‌‌‌‌‌‌‌‌క్రాస్‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ డీసీపీ రామానుజం, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ యుగంధర్‌‌‌‌‌‌‌‌రావు, జిల్లా రవాణా అధికారి జగదీష్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ పీడీ దివ్య, మునిసిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.