నెలాఖరులో తగ్గిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే..?

నెలాఖరులో తగ్గిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే..?

ఇరాన్ పై భూతలదాడులకు అమెరికా ప్లాన్ చేసిన వేళ గల్ఫ్ వార్ మరింత తీవ్రతరం అవుతోంది. ఒకపక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించటంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు బులియన్ మార్కెట్లు కూడా క్రాష్ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే తమ నగరాల్లో తాజా రేట్లను ముందుగా పరిశీలించండి. 

మార్చి 30న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. మార్చి 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.81 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 728గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 500గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 30, 2026న దేశవ్యాప్తంగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.250గా ఉంది.