హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాకు చెందిన డీజే క్లింటన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి వాచ్ మెన్ భార్యకు క్లింటన్ ఇచ్చాడు.
వాచ్ మెన్ భార్య ఈ డ్రగ్స్ని రోహిత్ రెడ్డికి ఇచ్చింది. గోవా నుంచి కొకెయిన్ తెచ్చి పార్టీకి డీజే క్లింటన్ సప్లై చేశాడు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్‌కు బానిసైనట్లు.. ఫామ్ హౌస్, పబ్బుల్లో వీకెండ్ లిక్కర్, డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ సప్లయర్లతో రోహిత్ రెడ్డికి డైరెక్ట్ లింకులు ఉన్నట్లు గుర్తించింది.
గత రెండు నెలల వ్యవధిలో మూడు వీకెండ్ పార్టీలు జరిగినట్లు.. పొలిటికల్, బిజినెస్ సెటిల్‌మెంట్లు జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ కుమార్, డ్రైవర్ శరత్ కుమార్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి సహా11 మందిని అరెస్ట్ సంగతి తెలిసిందే.
►ALSO READ | అది జైలా... గెస్ట్ హౌసా..? టీవీ చూస్తూ.. ఫోన్లు వాడుతున్న ఖైదీలు... ముగ్గురు వార్డెన్లు సస్పెండ్...
నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి వ్యాపారాలపై సిట్ ఫోకస్ పెట్టింది. నమిత్ శర్మ ఏ వ్యాపారాలు చేస్తారు, రోహిత్ రెడ్డితో కలిసి చేస్తున్న దందాలేంటి అన్న సమాచారం సేకరించే పనిలో సిట్ ఉంది. కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై, వీకెండ్ పార్టీలకు హాజరయ్యే హై ప్రొఫైల్ వ్యక్తులు, రోహిత్ రెడ్డి డ్రగ్స్ నెట్‌వర్క్‌పై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
