బెంగళూరులోని ఓ జైల్లో ఖైదీలు టీవీలు చూస్తూ ఫోన్లు వాడుతున్న వీడియో కలకలం రేపింది. ఈ ఘటన ముగ్గురు జైలు అధికారుల సస్పెన్షన్ కు దారి తీసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో జైలు ప్రాంగణంలో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ టీవీలో నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూస్తున్నారు. మరికొంతమంది ఖైదీలు ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఈ సాలా కప్ నమ్ దే అంటూ స్లొగన్స్ చేస్తున్నారు.
#Karnataka- 3 officials at #Bengaluru central prison have been suspended after videos of a few inmates using mobile phones got leaked.
— Siraj Noorani (@sirajnoorani) March 29, 2026
During a raid, prison officials recover two mobile phones, wrapped in Nandini milk packets & concealed inside a toilet pipe. https://t.co/KefYZ4SFmp pic.twitter.com/c0ZkYAxnqF
ఒక హత్య కేసుకు సంబంధించి రెండున్నరేళ్లకు పైగా జైలులో ఉన్న ఖైదీలు మార్చి 27న ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫుటేజీని జైలు బయట ఉన్న పరిచయస్తులకు రహస్యంగా షేర్ చేయడం వల్లే, అది వైరల్ అయ్యిందని జైలు అధికారులు చెబుతున్నారు. ఖైదీలు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా టాయిలెట్ బ్లాక్ దగ్గర అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లో ఫోన్లు దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | మంచిర్యాల జిల్లాలో విషాదం: లారీ కింద పడి ఎనిమిది నెలల పాప మృతి...
జైలులో క్షేత్రస్థాయి సిబ్బంది కుమ్మక్కయ్యి ఉండచ్చని సిబ్బంది ప్రమేయం వల్లే ఖైదీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన క్రమంలో కదిలా నుంచి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు.
ఈ ఘటన వెనుక ఏదైనా అంతర్గత కుట్ర ఉందా అని పరిశీలించడానికి ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు జరుగుతోందని తెలిపారు పోలీసులు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై జైలుకు చెందిన ముగ్గురు వార్డెన్లను సస్పెండ్ చేశారు అధికారులు.
Bengaluru Central Jail luxury scandal resurfaces 🚨#ViralVideo shows inmates using phones, TV & Netflix, clip from March 27.
— Reethu Rajpurohit (@reethu_journo) March 29, 2026
Phones were hidden in a toilet pipeline, with staff collusion allegedly aimed at tarnishing DGP Prisons Alok Kumar’s image.
3 jail Wardens suspended. pic.twitter.com/fHIHe6MgcJ
