సీబీఎస్ఈ 10, 12 త‌ర‌గ‌తుల ఎగ్జామ్స్ షెడ్యూల్.. మే 18న‌ ప్ర‌క‌ట‌న

సీబీఎస్ఈ 10, 12 త‌ర‌గ‌తుల ఎగ్జామ్స్ షెడ్యూల్.. మే 18న‌ ప్ర‌క‌ట‌న

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన‌ సీబీఎస్ఈ 10, 12 త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ షెడ్యూల్ ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డింది. ఇవాళ (శ‌నివారం) సాయంత్రం 5 గంట‌ల‌కు ఎగ్జామ్స్ తేదీల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ఉద‌యం ట్వీట్ చేశారు. అయితే అనూహ్యంగా కొన్ని కార‌ణాల వ‌ల్ల తేదీల‌ను ఫైన‌లైజ్ చేయ‌డంలో ఆల‌స్య‌మైంద‌ని ఆయ‌న సాయంత్రం మ‌రోసారి ట్వీట్ చేశారు. మే 18న ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అన్నీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం ఇబ్బంది మారుతుంద‌ని యూనివ‌ర్సిటీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన 29 స‌బ్జెక్టుల‌కు మాత్ర‌మే ఎగ్జామ్స్ పెడుతామ‌ని గ‌తంలోనే కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డిన సీబీఎస్ఈ 10, 12వ త‌ర‌గతుల‌ ప‌రీక్ష‌ల‌ను జూలై 1 నుంచి నిర్వ‌హించ‌నున్న‌ట్లు గ‌త వారం కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ ప్ర‌క‌టించింది. అయ‌తే ఈ ప‌రీక్ష‌ల‌ను జూన్ లోనే పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సోమ‌వారం ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుద‌ల‌తో దీనిపై క్లారిటీ రానుంది. మ‌రోవైపు 9, 11 తరగతుల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవ‌లే సీబీఎస్ఈ ప్ర‌క‌టించింది.

More News:

జూలై 1 నుంచి CBSE పెండింగ్ ఎగ్జామ్స్

సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు పెట్ట‌బోయే ఆ 29 స‌బ్జెక్టుల లిస్ట్ ఇదే..