రాష్ట్రాలకు రెమ్ డెసివిర్ నిలిపివేత

రాష్ట్రాలకు రెమ్ డెసివిర్  నిలిపివేత

రాష్ట్రాలకు రెమ్ డెసివిర్ కేటాయింపులను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో రెమ్ డెసివిర్ లభ్యతను మానిటర్ చేయాలని నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ ఏజెన్సీ, CDSCOలను ఆదేశించారు రసాయనాలు-ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుక్ మాండవీయ. దేశంలో తగినంత రెమ్ డెసివిర్ అందుబాటులో ఉందని మన్ సుక్ మాండవీయ తెలిపారు. ఏప్రిల్ 11న దేశంలో రోజుకు 33వేల వయల్స్ మాత్రమే ఉత్పత్తి కాగా... ప్రస్తుతం రోజుకు 3లక్షల 50వేల వయల్స్ ఉత్పత్తి అవుతోందని మాండవీయ చెప్పారు. ఒక్క నెలలోనూ రెమ్ డెసివిర్ ఉత్పత్తిని 10 రెట్లకు పైగా పెంచామన్నారు. ప్రస్తుతం 60 ప్లాంట్లలో రెమ్ డెసివిర్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు దేశంలో డిమాండ్ కంటే ఎక్కువగా రెమ్ డెసివిర్ అందుబాటులో ఉందని మాండవీయ స్పష్టం చేశారు.