వెనక్కి వెళ్లిన చైనా సైనికులు : డ్రాగన్ కంట్రీ విడుదల చేసిన చిత్రాల్లో నిజమెంత..?

వెనక్కి వెళ్లిన చైనా సైనికులు : డ్రాగన్ కంట్రీ విడుదల చేసిన చిత్రాల్లో నిజమెంత..?

భారత సరిహద్దు ప్రాంతమైన  గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ – 4 కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. రాత్రి ఓ కార్యక్రమంలో భాగంగా శాటిలైట్ చిత్రాల్ని విడుదల చేసింది. గాల్వాన్ నదిపై సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న  భారత్ కు చెందిన పెట్రోల్ పాయింట్ -14 వద్ద నుంచి చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారని తెలిపింది. అయితే ఆ ఫోటోలపై ఇండియన్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ సీసీటీవీ -4 విడుదల చేసిన ఫోటోల్ని దృవీకరించాల్సిం ఉంటుందని అన్నారు.

గత రాత్రి చైనా మీడియా సంస్థ  ప్రసారం చేసిన చిత్రాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్ కంట్రీ విడుదల చేసిన చిత్రాల్లో  పెట్రోల్ పాయింట్ – 14 వద్ద భారత సైనికుల స్థావరాలున్నాయి.  అలాగే కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్ లు  వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ ఏసీ) భారత భూ భాగం వైపు ఉన్నాయి.

చైనా విడుదల చేసిన చిత్రాల్లో వంపుగా గల్వాన్ నది పై ఒక తెల్లటి స్థావారాల్ని సూచించారు. అంతే తప్పా మిగిలిన ఆధారాలు లేవు. భారత్ – చైనా సైనికులు ఎవరూ లేరు.  ఈ సరిహద్దుల్లో చైనా సైనికులు వెనక్కి వెళ్లి పోయారాని ఆ దేశం ప్రచారం చేసుకుంటుంది. దీనిని చైనా ప్రభుత్వం నిర్ధారించాలని ఇండియన్ ఆర్మీ అధికారి ఎన్డీటీవీకి చెప్పారు.