ఆ సమస్యలున్న యువతనూ కరోనా కబళిస్తోంది

ఆ సమస్యలున్న యువతనూ కరోనా కబళిస్తోంది

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే యువతీ యువకులకు కరోనా వైరస్ సోకే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ & ట్రాపికల్ మెడిసిన్ సైంటిస్ట్ ల పరిశోధనల ఆధారంగా ప్రముఖ హెల్త్ జర్నల్ మెడ్రాక్సివ్‌ కొన్ని విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.

లండన్ స్కూల్ సైంటిస్ట్ ల పరిశోధనల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఒకరికి తీవ్రమైన కరోనా వైరస్ వ్యాధి సోకుతున్నట్లు తేల్చింది. మనదేశంలోని 30శాతం జనాభాలో 15 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు.  వ్యాక్సిన్ అందుబాటులో లేకపోయినా సోషల్ డిస్టెన్స్ ను పాటించడం ద్వారా కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు.

1.7 బిలియన్ ప్రజల్లో  (ప్రపంచ జనాభాలో 22%) కనీసం 0.4 మిలియన్ల మందికి కరోనా సోకిందని, రానురాను అంటువ్యాధిలా సోకే ప్రమాదం ఉందని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

25 సంవత్సరాల వయస్సు వారికి 10%, 50సంవత్సరాల వయసు వారికి 33%,  70 సంవత్సరాల వయస్సు వారికి  66% సోకిందన్న సైంటిస్ట్ లు..యువత కరోనా వైరస్ బారిన పడడం ప్రమాదానికి సంకేతాలని చెబుతున్నారు.

దీర్ఘకాలిక సమస్యలున్న వారిపై కరోనా ప్రభావం ఎక్కువే  

దీర్ఘకాలిక కిడ్నీ ,గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 50 ఏళ్లు పైబడిన వారిలో కరోనా  ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.

ఆర్ధికంగా నిలదొక్కుకున్న దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువే

ఆఫ్రికా దేశాలతో పాటు ప్రపంచంలో ఆర్ధిక స్థితిగతులు బాగున్న దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని   లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ & ట్రాపికల్ మెడిసిన్ సైంటిస్ట్ లు వెల్లడించారు. ఆఫ్రికాలో  16%, ఉత్తర అమెరికాలో 28%, ఐరోపాలో 31%మంది కరోనా బాధితులేనని చెప్పారు.

యూరోపియన్ తో పాటు

యూరోపియన్ తో పాటు ఆర్ధిక స్థితిగతులు బాగున్న దేశాల్లో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారని  గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనంలో తేలింది.

మనదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వాళ్లకే సోకింది

సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల కరోనా వైరస్ విజృంభిస్తుందని, మనదేశంలో కరోనా సోకిన ప్రతీ ముగ్గురు వయసు పై బడిన వారిలో బీపీ, మధుమేహం ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ సోకుతుందని లైఫ్కోర్స్ ఎపిడెమియాలజీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ తెలిపారు. కరోనా వైరస్ పెరిగే అవకాశం ఉన్ననేపథ్యంలో ఓ ప్రణాళికతో లాక్ డౌన్ ఎత్తివేసి మాస్క్ లు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా ఈ విపత్తునుంచి భయటపడొచ్చని డాక్టర్ గిరిధర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.