‘సర్కస్‌‌’ రిలీజ్‌‌కు రెడీ

‘సర్కస్‌‌’ రిలీజ్‌‌కు రెడీ

అందం, నటన.. రెండూ కలిసిన బుట్టబొమ్మ పూజాహెగ్డే. ఆమె హీరోయిన్‌‌గా నటించిన హిందీ మూవీ ‘సర్కస్‌‌’ రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. రణ్‌‌వీర్‌‌ సింగ్‌‌ హీరోగా రోహిత్ శెట్టి రూపొందించిన ఈ చిత్రంలో పూజతో పాటు జాక్వెలిన్‌‌ ఫెర్నాండేజ్‌‌ కూడా నటించింది. 1960 బ్యాక్‌‌డ్రాప్‌‌  పీరియాడిక్ మూవీ ఇది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసిన టీమ్ తాజాగా ‘సున్‌‌ జరా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. క్రిస్మస్‌‌ కానుకగా డిసెంబర్‌‌ 23న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆమె హీరోయిన్‌‌గా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశపరిచాయి. దీంతో నాలుగో సినిమాగా వస్తోన్న ‘సర్కస్‌‌’ హిట్ ఇస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. 

మరో హీరోయిన్ అయితే డీలా పడేదేమో కానీ పూజాహెగ్డే ఈ ఫెయిల్యూర్స్‌‌ను అంతగా పట్టించుకోలేదు. ‘సర్కస్‌‌’తో తనకు కచ్చితంగా సక్సెస్ వస్తుందనే హోప్‌‌తో ఉందామె. అందుకే ఓ వైపు ఈ మూవీ ప్రమోషన్స్‌‌పై ఫోకస్ పెట్టిన ఆమె, మరోవైపు ఫొటోషూట్స్‌‌తో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోస్‌లో యాష్  కలర్‌‌‌‌ డ్రెస్‌‌లో స్టైలిష్‌‌గా కనిపించిన ఆమె.. వాడి, వేడి చూపులతో అభిమానులకు గ్రామర్ ట్రీట్ ఇచ్చింది. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా.. క్రేజ్ తగ్గకపోవడానికి తన గ్లామరే కారణమన్నట్టుగా ఈ ఫొటోస్‌‌లో కనిపిస్తోంది పూజ. ఇక ప్రస్తుతం సల్మాన్‌‌తో కలిసి ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్‌‌’లో నటిస్తోన్న ఆమె.. తెలుగులో మహేష్‌‌ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో నటించబోతోంది.