సరిపడా గోడౌన్‌‌లు ఏర్పాటు చెయ్యాలె: కలెక్టర్ వెంకట్‌‌రావు

సరిపడా గోడౌన్‌‌లు ఏర్పాటు చెయ్యాలె:  కలెక్టర్ వెంకట్‌‌రావు

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో ధాన్యం నిల్వకు సరిపడా గోదాములు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెంకట్‌‌రావు ఎఫ్‌‌సీఐ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్‌‌లో  రైస్ మిల్లర్లు, ఎఫ్‌‌సీఐ, సివిల్ సప్లై అధికారులతో  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌‌‌‌ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేసి ఎఫ్‌‌పీఐకి అందించాలని సూచించారు. గోదాముల కొరత ఉందని మిల్లర్లు కలెక్టర్‌‌‌‌కు వివరించగా..  ఎఫ్‌‌సీఐ అధికారులను ఆరా తీశారు.  

వానాకాలం, యాసంగికి సంబంధించి 4 లక్షల మెట్రిక్ టన్నుల  సామర్థ్యం గల గోదాములు కావాల్సి ఉందని..  ముందుగా 77 వేల మెట్రిక్ టన్నుల  నిల్వలకు సరిపోను స్థలాన్ని కేటాయిస్తామని వాళ్లు చెప్పారు.  మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సోమ నరసయ్య మాట్లాడుతూ వర్షాలు, హమాలీ కొరత, రైల్వే వేగన్స్  సకాలంలో రాకపోవడంతో సీఎంఆర్‌‌‌‌ను  సకాలంలో అందించలేకపోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌‌  చైర్మన్ జానయ్య, అడిషనల్‌‌ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో జగదీశ్ రెడ్డి, ఎఫ్‌‌సీఐ ఏరియా మేనేజర్ వరుణ్ సూద్, సివిల్ సప్లై డీఎం రాంపతి, మిల్లర్లు పాల్గొన్నారు.

ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేయాలి

మునగాల, వెలుగు: రైతులు ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేసేలా హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్లు  అవగాహన కల్పించాలని  కలెక్టర్  వెంకట్‌‌రావు ఆదేశించారు.  శుక్రవారం మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు వేమూరి సురేశ్ సాగు చేసిన ఆయిల్ పామ్ తోటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2,450 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగయ్యాయన్నారు. ఈ యేడు 9,800 ఎకరాల్లో ఆయిల్ పామ్‌‌  సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.  కలెక్టర్ వెంట జిల్లా హాల్టికల్చర్‌‌‌‌ అధికారులు శ్రీధర్ గౌడ్,  శ్రీకన్న జగన్, పతాంజలి ఆయిల్ పామ్ కంపెనీ జిల్లా మేనేజర్  హరీశ్, ఫీల్డ్ ఆఫీసర్  సుధాకర్, వెంకటయ్య ఉన్నారు.