దిగ్విజయ్ ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ఘర్షణ

దిగ్విజయ్  ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ఘర్షణ

గాంధీ భవన్ లో దిగ్విజయ్  సింగ్ ముందే నేతల మధ్య డిష్యూం డిష్యూం జరిగింది.  పార్టీలో అంతర్గత గొడవలపై ఓవైపు దిగ్విజయ్ సర్ది చెప్తుంటే.... మరోవైపు నేతలు గొడవ చేశారు. గాంధీ భవన్ కు చేరుకున్న ఓయూ నేతలు మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ పై దాడికి యత్నించారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో మల్లు రవి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఆందోళనకు దిగారు నేతలు.  

కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని మల్లు రవి అన్నారు. ఎవరూ బయటకొచ్చి అరవొద్దని..అందరూ ఒకర్నొకరు  గౌరవించుకోవాలని చెప్పారు. ఓయూ విద్యార్థి నేతలు శాంతించాలన్నారు. రెచ్చిపోతే కాంగ్రెస్ కే నష్టమన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని సూచించారు.

దిగ్విజయ్ వరుస భేటీలు

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ   AICC సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీ పరిస్థితి, కమిటీల నియామకం, అసంతృప్తుల వాదనలు వింటున్నారు. BRSను ఓడించేందుకు తమ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? పార్టీ బలోపేతం కోసం ఏం చేశారు..ఏం చేయబోతున్నారు..? అంతర్గత సమస్యలపై అభిప్రాయాలు పరిష్కారం కోసం సలహాలు ఏంటని దిగ్విజయ్ వరుస ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రశ్నలు అడుగుతూనే మరోవైపు నేతలకు డిగ్గీ క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయతీ ప్రస్తావనే ఉండొద్దని సూచించినట్లు గాంధీ భవన్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఎవరూ ఏం చేస్తున్నారో హైకమాండ్ అంతా గమనిస్తుందని..ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.