సీడబ్ల్యూసీ కోసం సీనియర్ లీడర్ల లాబీయింగ్

సీడబ్ల్యూసీ కోసం సీనియర్ లీడర్ల లాబీయింగ్

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎలక్షన్స్ దగ్గర  పడుతున్నకొద్ది ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఈసారి ఎలాగైనా  సీడబ్ల్యూసీలో చోటు దక్కించుకోవాలని సీనియర్ లీడర్లు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే, తెలంగాణ నుంచి ఎవరెవరు సీడబ్ల్యూసీలో చోటు కోసం పోటీ పడుతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈనెల 24 నుంచి మూడ్రోజుల పాటు రాయ్ పూర్ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. జాతీయ స్థాయిలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సీడబ్ల్యూసీదే ఫైనల్ నిర్ణయం. ప్లీనరీ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నిక  జరగనుందని సమాచారం. చివరిసారి 1997 ఆగస్ట్ లో కలకత్తా లో సీడబ్ల్యూసీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడే సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారా లేక డైరెక్ట్ గా నామినేట్ చేస్తారా అనేది ఫస్ట్ డే ప్లీనరీ సమావేశంలో నిర్ణయిస్తారు.

సీడబ్ల్యూసీలో చోటు కోసం తెలంగాణ నుంచి చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హై కమాండ్ లో మంచి పట్టుంది. ఉత్తమ్ కు జనరల్ సెక్రటరీ హోదా ఇచ్చి ఏదైనా రాష్ట్రానికి ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సీడబ్ల్యూసీ కోసం పోటీ పడుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి వరకు పోటీపడి నిరాశ చెందిన ఆయన, ఈసారి సీడబ్ల్యూసీ లో అవకాశం కల్పిస్తారని సన్నిహితుల దగ్గర చెప్తున్నట్లు టాక్. వీహెచ్ కూడా సీడబ్ల్యూసీ పై ఆశలు పెట్టుకున్నారు. సోనియా గాంధీ తన సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని ఈసారి సీడబ్ల్యూసీలోకి తీసుకుంటారని వీహెచ్ అనుకుంటున్నారు. జానారెడ్డి కూడా సీడబ్ల్యూసీలో చోటు కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి రిజర్వేషన్ కోటాలో తనకు ఛాన్స్ ఇవ్వాలని ఏఐసీసీ ముందు అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికి సీడబ్ల్యూసీలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు లాబీయింగ్ మొదలుపెట్టారు