హుజురాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ సమావేశం

హుజురాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ సమావేశం

గాంధీ భవన్‎లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ పేరుతో జరుగుతున్న ఈ మీటింగ్‎కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‎తో పాటు... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. హుజురాబాద్‎లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ కూడా ఈ మీటింగ్‎కు వచ్చారు. హుజురాబాద్ రిజల్ట్స్, యాసంగి వరిసాగు, నిరుద్యోగ సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. 

హుజురాబాద్ బై ఎలక్షన్‎లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడంతో.. పీసీసీ నాయకత్వంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. బల్మూరి వెంకట్‎ను బలిపశువును చేశారంటూ రేవంత్, భట్టి పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. కాగా.. ఇప్పటికే హుజురాబాద్ ఫలితాల బాధ్యత తనదేనని పీసీసీ చీఫ్ రేవంత్ ప్రకటించారు. మరోవైపు సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రతిసారి సమావేశానికి రానని... తన అవసరం ఉన్నప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయారు.