Deepika Padukone: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..ఇప్పుడు ఎన్నో నెలో తెలుసా?

Deepika Padukone: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..ఇప్పుడు ఎన్నో నెలో తెలుసా?

నార్త్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సెలబ్రిటీ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనే తల్లితండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీపికా త్వరలో తల్లి కాబోతోందని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ది వీక్ రిపోర్ట్ వెల్లడించింది. రణ్‌వీర్ సింగ్, దీపికా 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి పెళ్లయి 5 ఏళ్ళు అవుతున్న..ఇంతవరకు పిల్లలు లేకపోవడంతో తరుచూ ప్రశ్నలు ఎదుర్కుంటూ వస్తున్నారు. బాలీవుడ్లో రణ్‌వీర్ సింగ్, దీపికా స్టార్ కపుల్స్ మ్యారేజ్ తర్వాత సెలబ్రిటీ కపుల్ అయిన రణ్‌బీర్,ఆలియా ఇప్పటికే పేరెంట్స్ స్టేటస్ పొందడంతో వీరికి ప్రశ్నలు మరింత ఎక్కువయ్యాయి. 

రీసెంట్గా బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ (బాఫ్టా) 77వ అవార్డుల ఈవెంట్ కి దీపికా పదుకోన్ ప్రజెంటర్ గా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో దీపికా భారతీయత ఉట్టిపడేలా సబ్యసాచి చీరలో ఆకట్టుకుంది. అయితే..బేబీ బంప్ కనిపించకుండా ఉండేందుకు ఫుల్ హుడీని ధరించినట్లు సమాచారం. దీపికా ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ రెండో ట్రైమెస్టర్లో ఉందని కూడా ది వీక్ రిపోర్ట్ చెప్పడం విశేషం. అంతేకాదు..ప్రస్తుతం దీపికా ప్రెగ్నెన్సీతో ఉండటంతో ది వైట్ లోటస్ సీజన్ 3 నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ సినీ సర్కిల్లో వినిపిస్తోంది. 

తనకు,రణ్‌వీర్కు పిల్లలంటే చాలా ఇష్టమని, తాము కూడా త్వరలో ఓ ఫ్యామిలీని మొదలు పెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకోనే చెప్పింది. ఇక అంతలోపే ఆమె తల్లి కాబోతోందన్న న్యూస్ వినిపిస్తుండటం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. 

ఇక దీపికా ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్టులలో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD మూవీ ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.