టాప్ టెన్ అందగత్తెల లిస్టులో దీపికా

టాప్ టెన్ అందగత్తెల లిస్టులో దీపికా

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. దీపికా పదుకొనె ఈ రెండూ సాధించింది. ఓవైపు బాలీవుడ్‌‌లో టాప్ హీరోయిన్‌‌గా వెలుగుతోంది. మరోవైపు విదేశాల్లో సైతం ఫాలోయింగ్ సంపాదించింది. ఆమె క్రేజ్ ఏ రేంజ్‌‌లో పెరిగిందంటే.. ప్రపంచంలోని టాప్ టెన్ అందగత్తెల లిస్టు వేస్తే తొమ్మిదో స్థానంలో నిలిచి సెన్సేషన్ సృష్టించింది. ఓ ప్రముఖ హాలీవుడ్ సంస్థ ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. కళ్లు, ముక్కు, పెదవులు, ముఖాకృతి వంటివన్నీ పరిశీలించి మరీ పదిమందిని ఎంపిక చేస్తుంది. అందుకే ఈ జాబితాలో చోటు దక్కడాన్ని గొప్పగా భావిస్తారంతా. ఈసారి చేసిన సర్వేలో బ్రిటిష్ నటి జోడీ కోమర్  ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా సెలెక్టయ్యింది. జెండేయా, టేలర్ స్విఫ్ట్, కిమ్ కర్దాషియన్, బెల్లా హదీద్, బియాన్స్, అరియానా గ్రాండ్ లాంటి వారు మిగతా స్థానాల్లో నిలిచారు. 91.22 స్కోర్‌‌‌‌తో దీపిక నైన్త్ ప్లేస్ దక్కించుకుంది. దాంతో ఆమె పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.

ఇక దీపిక ప్రస్తుతం షారుఖ్ ‘పఠాన్‌‌’తో పాటు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’లోనూ నటిస్తోంది. అయితే అతి త్వరలో ఆమె మరో ప్రెస్టీజియస్ తెలుగు సినిమాలో యాక్ట్ చేయబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అది మరేదో కాదు.. మహేష్‌‌ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న అడ్వెంచర్ ఫిల్మ్. జక్కన్న సినిమా అంటే ఏ రేంజ్‌‌లో ఉంటుందో తెలిసిందే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్‌‌ని తీసుకోవాలని ప్లాన్ చేశారట. ఆల్రెడీ చర్చలు ముగిశాయని, దీపిక ఎస్ చెప్పేసిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్.