సిద్ధివినాయక ఆలయంలో దీపిక పూజలు

సిద్ధివినాయక ఆలయంలో దీపిక పూజలు

ఛపాక్ మూవీ విడుదల సందర్భంగా హీరోయిన్ దీపికా పదుకొనె… ముంబై సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఛపాక్ మూవీలో యాసిడ్ దాడి బాధితురాలి పాత్ర పోషించారు దీపిక. ఈ సినిమాకు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ వినోదపు పన్ను మినహాయించాయి. యూపీలో సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సూచనతో కార్యకర్తలకు ఈ షో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

అటు పంజాబ్ లోనూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యాసిడ్ దాడి బాధితులకు ఈ సినిమా చూపించనున్నారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. బాధితురాలికి మొదటి నుంచి అండగా ఉండి, న్యాయ కోసం పోరాడిన లాయర్ అపర్ణా భట్ కు క్రెడిట్ ఇవ్వాలన్న కింది కోర్టు తీర్పుపై ఫాక్స్ స్టూడియో ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది.