హోటల్ సర్వీసు ఛార్జీలో ట్విస్ట్

హోటల్ సర్వీసు ఛార్జీలో ట్విస్ట్

దేశ రాజధానిలో హోటళ్లు, రెస్టారెంట్ లు ఇచ్చే ఫుడ్ బిల్లులపై సర్వీసు ఛార్జీలు విధించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే జారీ చేసిన మార్గదర్శకాలపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధించింది. కస్టమర్ల నుంచి సర్వీసు ఛార్జీలు వసూలు చేయరాదంటూ కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథార్టీ (CCPA) మార్గదర్శకాలు చేసిన సంగతి తెలిసిందే. జూలై 04వ తేదీన ఈ ఆదేశాలు జారీ చేసింది. హోటల్ లో ఫుడ్ బిల్లులో సర్వీసు ఛార్జీ చేర్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో రెస్టారెంట్లు, హోటల్స్ పై తీవ్ర ప్రభావం చూపెట్టింది. దీంతో ఈ విషయం హైకోర్టుకు చేరుకుంది. 

NRAI, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఇండియా పిటిషన్లను దాఖలు చేసింది. బుధవారం జస్టిస్ యశ్వంత్ వర్మ విచారణ చేపట్టారు. మార్గదర్శకాలపై స్టే విధించింది. టేక్ అవే ఐటమ్స్ కు సర్వీసు ఛార్జీని వసూలు చేయకూడదని సూచించింది. చెల్లించకూడదంటే.. కస్టమర్లు రెస్టారెంట్ లోకి ప్రవేశించవద్దు.. అది వారి ఛాయిస్ కు సంబంధించిన అంశమని కోర్టు వెల్లడించింది. రెండు షరతులతో గైడ్ లైన్స్ లోని పారా 7పై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ఈ పిటిషన్ల విచారణ నవంబర్ 25న జరుగనుంది. రెస్టారెంట్లు, హోటళ్లు సర్వీసు ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు.