సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు : మోదీ

సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు :  మోదీ

పశ్చిమ బెంగాల్లో  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మర్చిందని ఆరోపించారు.  రాష్ట్రాన్ని అవినీతికి కేంద్రంగా మార్చారన్నారు. వెస్ట్ బెంగాల్లోని నార్త్ 24పరగణ జిల్లాలోని బరాక్ పూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. తాను ఉన్నంత వరకు సీఏఏను రద్దు చేయనివ్వనన్నారు. 

టీఎంసీ చొరబాటు దారులను కాపాడుతుందని విమర్శించారు ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్ లో టీచర్ రిక్రూట్‌మెంట్ కేసును ప్రస్తావిస్త..   టిఎంసి ప్రజల నుండి దోపిడీ చేసిన డబ్బును చట్టబద్ధంగా ప్రజలకు తిరిగి ఇస్తామని మోదీ అన్నారు. అవినీతి నేతలను మోదీ శాంతియుతంగా కూర్చోనివ్వరని..  ఏ అవినీతి నాయకుడిని వదిలిపెట్టరన్నారు.  

టీఎంసీ మీ నుంచి దోపిడీ చేసిన సొమ్మును చట్టబద్ధంగా మీకు తిరిగి ఇస్తామని తెలిపారు.  పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలు  బహరంపూర్, కృష్ణానగర్, రాణాఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్-దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్ మరియు బీర్భూమ్ నియోజకవర్గాలకు  మే 13న నాలుగో దశ ఓటింగ్‌లో ఓటింగ్ జరగనుంది.