Vimala Raman-Vinay Rai: విల‌న్‌తో విమల రామన్ డేటింగ్..రూమర్స్ నిజం చేస్తూ రొమాంటిక్ ఫొటోస్ పోస్ట్!

Vimala Raman-Vinay Rai: విల‌న్‌తో విమల రామన్ డేటింగ్..రూమర్స్ నిజం చేస్తూ రొమాంటిక్ ఫొటోస్ పోస్ట్!

టాలీవుడ్ బ్యూటీ విమల రామన్ (Vimala Raman) తెలుగులో తనదైన సినిమాల్లో నటించి మెప్పించింది. పదికి పైగా తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి సరైన సక్సెస్ మాత్రం దక్కలేదనే చెప్పుకోవాలి. కానీ, అందం, అభినయంతో పాటు నటనతో మంచి గుర్తింపు అయితే పొందింది.

ఇక రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి మరింత అందంతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.ఇన్నాళ్లు ..విమల రామన్ సినిమాలు చేస్తుంటే రాని ఫేమ్..కాని వైరల్..ఇపుడు మరింత ట్రెండ్ అవుతూ వస్తుంది.అందుకు కారణం ఏంటో వివరాల్లో తెలుసుకుందాం. 

చాలా కాలంగా హీరోయిన్ విమ‌లారామ‌న్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో విలన్ అయిన వినయ్ రాయ్(Vinay Roy)తో డేటింగ్ చేస్తున్నట్లు గుస‌గుస‌లు ఉన్నాయి.తెలుగు,తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన‌ విమలా రామన్,ప్రస్తుతం విలన్ పాత్రలతో పాపుల‌రైన వినయ్ రాయ్‌తో రిలేషన్‌షిప్‌,స్నేహం ప్రేమాయ‌ణం గురించి పుకార్లు రోజురోజుకు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. కానీ,ఈ జంట అయితే త‌మ మ‌ధ్య‌ ఉన్న రిలేష‌న్ షిప్ గురించి మాత్రం ఎపుడూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. 

అయితే,లేటెస్ట్గా మ‌రోసారి వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత డెప్త్ గా మారిందని వార్తలు మళ్ళీ మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. రీసెంట్ గా విమల రామన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ స్టైలిష్ గా, రొమాంటిక్ గా ఉన్నాయి. ఇక ఆ ఫొటోస్ కి విమల-వినయ్' VV (VimalaVinay) పేరుతో ప్రత్యేక ఫోటోషూట్ సిరీస్ నుండి ఫోటోలను షేర్ చేసారు. దీంతో ఇది వారిద్దరి మధ్య ఉన్న ఎమోషన్, ఎఫక్షన్ అనేది వీరి డేటింగ్ కి కారణం అయిందని నెటిజన్స్ ఫిక్స్ అయ్యారు. కాదు..కాదు..వందశాతం ఇది నిజమే అంటున్నారు.దీంతో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక విమ‌లా రామ‌న్ కానీ, విన‌య్ కానీ త‌మ డేటింగ్ వార్త‌ల‌ను అధికారికంగా క‌న్ఫామ్ చేయాల్సింది. 

విమల రామన్ సినిమాల విషయానికి వస్తే..తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో 2009 లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత గాయం 2, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి,రాజ్, చట్టం వంటి చిత్రాలలో నటించింది. ముఖ్యంగా వినయ్ రాయ్ - విమలా రామన్ వరుణ్ తేజ్ చిత్రం 'గాండీవధారి అర్జున'లో పెళ్ల‌యిన‌ జంటగా న‌టించారు. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ..ఆఫ్ ది స్క్రీన్ కెమిస్ట్రీ రెండూ మ్యాచ్ అయ్యాయని ఇప్పుడు మ‌రోసారి తమ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గుస‌గుస‌లాడుతున్నారు. 

వినయ్ రాయ్ సినిమాల విషయానికి వస్తే వాన సినిమాలో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా హనుమాన్, గాండీవధారి అర్జున, ఈగల్ వంటి సినిమాలో విలన్ గా చేసి మంచి గుర్తింపు పొందాడు.