హైదరాబాద్​లో కొత్త స్విఫ్ట్  

హైదరాబాద్​లో కొత్త స్విఫ్ట్  

హైదరాబాద్, వెలుగు: మారుతి సుజుకి తాజాగా లాంచ్​ చేసిన ఐకానిక్ హ్యాచ్‌‌‌‌బ్యాక్ కారు న్యూ ఎపిక్ స్విఫ్ట్​ సోమాజీగూడలోని​ ఆర్​కేఎస్​ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌ లోకి వచ్చింది.   న్యూ ఎపిక్ స్విఫ్ట్ కొత్త డ్యాష్‌‌‌‌బోర్డ్ డిజైన్‌‌‌‌, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్ సిస్టమ్‌‌‌‌తో వస్తుంది.  కనెక్టెడ్​ కార్ టెక్నాలజీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, కొత్త 1.2-లీటర్ పెట్రోల్​ఇంజన్​ఉంటాయి. 85 హెచ్​పీ పవర్,  110 ఎన్​ఎం టార్క్‌‌‌‌ను అందిస్తుందని ఆర్​కేఎస్​ మోటార్స్​ తెలిపింది.