ట్విట్టర్ పై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు 

ట్విట్టర్ పై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు 

ట్విట్టర్ పై మరో కేసు నమోదైంది. ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్ (చైల్డ్ పోర్నోగ్రఫీ) ఉందంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (NCPCR).. ఢిల్లీ సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ సైబర్ పోలీసులు ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ట్విట్టర్ కు వ్యతిరేకంగా NCPCR కొన్నిరోజుల కిందటే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఢిల్లీ సైబర్ పోలీసులు స్పందించకపోవడంతో NCPCR  లేటెస్టుగా సమన్లు పంపింది. ఈ క్రమంలో ట్విట్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ తెలిపారు.

 మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన ఐటి నిబంధనల అమలు విషయంలోనూ కేంద్రానికి, ట్విట్టటర్‌కు మధ్య వార్‌ నడుస్తోంది.