మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • సర్వీసులు ప్రారంభించిన ఢిల్లీ సర్కార్

ఢిల్లీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇవాళ్టి నుంచి ఆరంభమైంది. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు ఉచిత రవాణాను కల్పిస్తామని ఇటీవల ప్రకటించారు. మహిళలు… ప్రభుత్వ బస్సులు, క్లస్టర్‌ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. వీరికి పింక్‌ టికెట్లను ఇస్తారు. ఇందుకోసం మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. పింక్‌ టికెట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెల్లిస్తుంది. ఫ్రీ రవాణ సౌకర్యంతో మహిళల భద్రతతో పాటు వారి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తెలిపారు.