
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమైందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణలో నిజాం నియంతృత్వ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రజలను జాగృతం చేసేందుకు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర పార్టీ నేతలతో కలిసి బ్యాక్ వాక్ ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళన చేయాల్సి రావడం బాధకరమన్నారు నారాయణ. ప్రభుత్వ తీరుమారే వరకు ఆందోళన ఆగదన్నారు.