ప్లాన్ ఛేంజ్ చేసిన కంగనా

ప్లాన్ ఛేంజ్ చేసిన కంగనా

ముంబై: రియల్ లైఫ్ లో ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తుందో.. వెండితెరపై కూడా అంతే శక్తిమంతమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం ఇలాంటి సినిమాలు మూడ్నాలుగు చేస్తోంది. వాటిలో ‘ధాకడ్’ ఒకటి. మే 27న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ డేట్ మారుస్తున్నామని, ఓ వారం ముందే రావాలని నిర్ణయించుకున్నామని.. మే 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక టీజర్ ను కూడా వదిలారు. 

యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘ధాకడ్’లో ఏజెంట్ అగ్ని అనే పాత్రలో కంగనా కనిపించనుంది. అందుకు తగ్గట్లుగానే టీజర్ లో కనిపిస్తోంది. రకరకాల ఆయుధాలను తేలికగా ఆపరేట్ చేసేస్తోంది. జాలన్నదే లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. ఓసారి షూట్ చేసి.. మరోసారి కసకసా కోసి.. కాస్త భయపెడుతోంది కూడా. ‘ఎప్పుడూ అబ్బాయిలే ఎందుకు ఎంజాయ్ చేస్తుంటారు?, శరీరాల నుంచి ప్రాణాల్ని వేరు చేయడం నా బిజినెస్’ లాంటి డైలాగ్స్ చూస్తుంటే ఆమె పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రంజీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్ రామ్ పాల్, దివ్యా దత్తా, శాశ్వతా ఛటర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.