డర్టీ ఫెలో ఫ్యామిలీ డ్రామా

డర్టీ ఫెలో ఫ్యామిలీ డ్రామా

శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి లీడ్ రోల్స్‌‌‌‌లో ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి.యస్. బాబు నిర్మించిన   చిత్రం ‘డర్టీ ఫెలో’. మే 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు అతిథులుగా హాజరైన తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. శాంతి చంద్ర మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ మూవీ. ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నాం’ అని చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్స్ థ్యాంక్స్ చెప్పారు. చిన్న  చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అని దర్శకుడు ఆడారి మూర్తి సాయి అన్నాడు. యాక్టర్ సత్యప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్, లిరిసిస్ట్ పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.