పాత బ్రాండ్స్ సంచులకు ఆర్డర్ ఇవ్వొద్దు

పాత బ్రాండ్స్ సంచులకు ఆర్డర్ ఇవ్వొద్దు
  • సరఫరా చేయనున్న కేంద్రం 

హైదరాబాద్‌‌, వెలుగు: వన్ నేషన్ - వన్ ఫెర్టిలైజర్ నినాదంలో భాగంగా అక్టోబర్ నుంచి దేశమంతటా ఒకే బ్రాండ్ ఎరువులను కేంద్రం సరఫరా చేయనుంది. ఈ మేరకు వచ్చే నెల15 నుంచి పాత బ్రాండ్స్ సంచులకు ఆర్డర్ ఇవ్వొద్దని ఎరువులు కంపెనీలను కేంద్ర సర్కారు ఆదేశించింది. ఇప్పటికే ఉన్న పాత సంచులను డిసెంబర్ 31లోగా మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.

యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎన్‌‌పీకే తదితర ఎరువులను కంపెనీలు వారి పేర్లతో విక్రయిస్తున్నాయి. వన్ నేషన్ - వన్ ఫెర్టిలైజర్​లో భాగంగా దేశం మొత్తం ‘ప్రధానమంత్రి భారతీయ జనుర్వారక్ పరియోజన’ పేరుతో విక్రయించాలని నిర్ణయించారు. అన్ని ఎరువులు కూడా ఇదే బ్రాండ్​తో మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్ర పేరుతో ఎరువుల షాపుల రూపురేఖలు మారనున్నాయి.