ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
The Election Commission of India has announced biennial elections to the Council of States (Rajya Sabha) to fill 37 seats from 10 states.
— ANI (@ANI) February 18, 2026
Date of polls- 16 March 2026.
Counting of votes will take place on the same day as polling. pic.twitter.com/gv8njEFbgP
తెలంగాణలో కూడా రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, ఛత్తీస్ గర్, పశ్చిమ బెంగాల్, హర్యానా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండటం గమనార్హం.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:
* ఫిబ్రవరి 26న నోటిఫికేషన్
* నామినేషన్లకు చివరి తేదీ: మార్చి 5
* మార్చి 6న నామినేషన్ల పరిశీలన
* నామినేషన్ల విత్ డ్రాకు తేదీ: మార్చి 9
* మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ ఎన్నికలు
* మార్చి 16న సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్
