బీఎస్పీ అభ్యర్థి మృతితో మధ్యప్రదేశ్​లోఎన్నికలు వాయిదా

బీఎస్పీ అభ్యర్థి మృతితో మధ్యప్రదేశ్​లోఎన్నికలు వాయిదా

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్​లోని బేతుల్​పార్లమెంట్​ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతిచెందారు. దీంతో ఎలక్షన్​కమిషన్​ అక్కడ ఎన్నికను బుధవారం వాయిదా వేసింది. ఈ నియోజకవర్గం లో రెండో దశలో ఈ నెల 26న లోక్‌‌సభ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ స్థానం నుంచి పోటీకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్​భలావికి మంగళవారం గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన మృతిచెందారు. 

స్థానిక అధికారులు భలావి మృతిపై ఎన్నికల కమిషన్​కు సమాచారం అందించారు.  దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 52 ప్రకారం బేతుల్ ​సెగ్మెంట్​ఎన్నికను ఈసీ  వాయిదా వేసింది. ఆ స్థానంలో మే 7న మూడో దశలో ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలిపింది. గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ అభ్యర్థి పోలింగ్‌‌కు ముందు మరణిస్తే, ఆ పార్టీ మరో అభ్యర్థిని గుర్తించి, నిలబెట్టేం దుకు ఎన్నికను వాయిదా వేస్తారు.