వైరల్ విశాలాక్షిగా ఈషా

వైరల్ విశాలాక్షిగా ఈషా

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా.. గ్లామర్ రోల్స్‌‌తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. బుధవారం ఈషా బర్త్‌‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న ‘మామా మశ్చీంద్ర’ టీమ్ తనకు విషెస్ చెప్పింది. అలాగే ఇందులోని ఆమె పాత్రను పరిచయం చేశారు. ‘వైరల్ విశాలాక్షి’గా ఈషా కనిపించనుందని ప్రకటించారు.

సుధీర్ బాబు మూడు డిఫరెంట్‌‌ పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకుడు. ఈషాతో పాటు  మృణాళిని రవి మరో హీరోయిన్‌‌. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.