ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ అరెస్ట్

ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ అరెస్ట్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. ఎన్ఎస్ఈ  డేటా సెంటర్ లో  కో లొకేషన్ కు సంబంధించిన కేసులో చిత్రను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే చిత్ర రామకృష్ణతో సహా పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చిత్ర వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను శనివారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఎన్ఎస్ఈ నిందితురాలి   పట్ల సెబీ దయగా ఉందని.. ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ చెప్పారు. నిజాలు రాబట్టడానికి  ఆమె నిరంతర కస్టడీ విచారణ అవసరమన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి  హిమాలయ యోగి పాత్రపై ఇంకా తెలియాల్సి ఉంది.

ఉక్రెయిన్‎కు ప్రపంచ దేశాల నుంచి సాయం