నాగేంద్రన్​కు ఉరి అమలు

నాగేంద్రన్​కు ఉరి అమలు

నాగేంద్రన్​కు ఉరి అమలు
సింగపూర్:
డ్రగ్స్ స్మగ్లింగ్​ కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్​ను సింగపూర్​ ప్రభుత్వం బుధవారం ఉరితీసింది. నాగేంద్రన్​కు మతిస్థిమితంలేదని, శిక్ష తగ్గించాలని ఆయన తల్లి, కుటుంబ సభ్యులు, మలేసియా ప్రధాని సహా చాలామంది చేసిన విజ్ఞప్తిని సింగపూర్​ ప్రభుత్వం తోసిపుచ్చింది. లాయర్​ ద్వారా నాగేంద్రన్​ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్​ను కోర్టు కొట్టేసిన తర్వాత శిక్ష అమలుకు ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా కుటుంబ సభ్యులను చూడాలన్న నాగేంద్రన్​ కోరికను తీర్చి, బుధవారం తెల్లవారుజామున ఉరి తీసినట్లు అధికారులు చెప్పారు. మలేసియాకు చెందిన నాగేంద్రన్​ధర్మలింగం 2009లో  సింగపూర్​లోకి డ్రగ్స్​ తీసుకొస్తూ అధికారులకు పట్టుబడ్డడు.