ప్రపంచంలో అతిపెద్ద గేమింగ్ మార్కెట్‌లలో ఒకటి భారత్

ప్రపంచంలో అతిపెద్ద గేమింగ్ మార్కెట్‌లలో ఒకటి భారత్

ప్రపంచవ్యాప్తంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఫేస్‌బుక్‌… తన మొట్టమొదటి గేమింగ్ ఈవెంట్ FBGamingPressStart ను ఇండియాలో నిర్వహించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వర్చుల్‌ ఈవెంట్‌లో గేమ్ డెవలపర్లు, పబ్లిషర్స్‌ మరియు క్రియేటర్స్‌ పాల్గొన్నారు. వారంతా ఫేస్‌బుక్‌లో వారి గేమింగ్ ఉనికిని ఎలా నిర్మించారో, ఎలా స్కేల్ చేసుకున్నారో, అలాగే కొత్త ప్రేక్షకులను కనుగొని వారి కమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ ఈవెంట్‌లో ఫేస్‌బుక్‌ గేమింగ్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ జియో హంట్, ఫేస్‌బుక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీ అజిత్ మోహన్, ఫేస్‌బుక్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మనోహర్ హోచందాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫేస్‌బుక్ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ శ్రీ మనోహర్ హోచందాని మాట్లాడుతూ.. "ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ మార్కెట్‌లలో ఒకటిగా భారత్ ఎదుగుతోందన్నారు. ఫేస్‌బుక్‌లో గేమింగ్‌పై, ముఖ్యంగా లైవ్ వ్యూయర్‌షిప్‌తో గేమింగ్ వీడియోపై ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారన్నారు. గత ఏడాదిలో గేమింగ్ వీడియో చూసేవారి సంఖ్య 530% పైగా పెరిగిందన్నారు.