పడిపోతున్న టెంపరేచర్.. చలితీవ్రతతో వణుకు

పడిపోతున్న టెంపరేచర్.. చలితీవ్రతతో వణుకు
  • సిర్పూర్‌‌(యు)లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

హైదరాబాద్‌‌, వెలుగు: చలి తీవ్రతతో రాష్ట్రం వణికిపోతోంది. రోజురోజుకు నైట్ టెంపరేచర్స్ తగ్గిపోతున్నయ్. సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిన్నెదరి 3.5, బేల 3.8, ఆర్లి-టి 3.9, సిర్పూర్-యూ 4 , జైనథ్ 4.9, వాంకిడి 5, మాంగృడ్ 5.1, బజార్ హత్నూర్ 5.3, ఆదిలాబాద్ 5.5, లోకారి 5.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌ జిల్లా సిర్పూర్‌‌ (యు)లో 6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్‌‌లో 11.2 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌‌ నాగరత్న తెలిపారు.