కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్లలో లోపాలతో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్లలో లోపాలతో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

 

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన ఎస్ఎస్-5  అగ్రికల్చర్ 100 కేవీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ 15 రోజుల్లో  రెండు సార్లు కాలిపోయింది.  గత నెల 26న కాలిపోతే  రిపేర్​ కోసం కామారెడ్డికి తీసుకొచ్చారు. రిపేర్​ తర్వాత తీసుకెళ్లి న 3 రోజులకే మళ్లీ కాలిపోయింది. మళ్లీ  తీసుకొచ్చి రిపేర్​చేసుకుని బుధవారం తీసుకెళ్లారు.  ట్రాక్టర్​కిరాయి, ఇతరత్రా ఖర్చులు రూ.7 వేల వరకు అయ్యాయి. 15 రోజుల్లో రూ.14 వేలు ఖర్చయ్యాయి.  ఇవన్నీ రైతులు భరించుకోవాల్సి వచ్చింది.

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలో పంటల సాగుకు భూగర్భజలాలే ప్రధాన ఆధారం. బాన్సువాడ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ఏరియాలకు నిజాంసాగర్​ప్రాజెక్టు నీళ్లు వస్తాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరి, ఇతర పంటలు అన్నీ బోర్ల కింద వేస్తారు. దీంతో కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగం ఎక్కువే. జిల్లాలో అగ్రికల్చర్ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లు లక్ష వరకు ఉన్నాయి. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్​స్థాయిని బట్టి కనెక్షన్లు ఉంటాయి. కొన్ని చోట్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లపై రెండింతల కనెక్షన్లు ఉన్నాయి.  టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఓవర్ లోడ్, సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోపాల వల్ల అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయి. జిల్లాలో గత నెలన్నరగా ఎక్కువగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. జిల్లాలో ఇటీవలి కాలంలో రోజుకు 15 వరకు కాలిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నారు. కామారెడ్డి ఏరియాలో జూలై నెలలో 300 పైగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు రిపేర్లకు వచ్చినట్లు ఎన్పీడీసీఎల్  అధికారులు తెలిపారు. ఇందులో చాలా వరకు 63 కేవీ, 100 కేవీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు ఉన్నాయి. 

లైన్లలో లోపాలతో...
ఇటీవల కురుస్తున్న వర్షాలకు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలు ఎక్కువయ్యాయి. సప్లయ్​ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తరచూ లోపాలు ఏర్పడుతున్నాయి. వైర్లు లూజుగా ఉండడంతో గాలి వచ్చినప్పుడు, వర్షాలకు  ఒదానికి ఒకటి తాకడంతో షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు దెబ్బతినడంతో పాటు కాలిపోతున్నాయి. అయితే రైతుల తప్పిదాలతోనే మోటార్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.

రైతులపైనే భారం
ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్​కాలిపోతే ఊరి నుంచి రిపేరింగ్ సెంటర్ వరకు డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్పీడీసీఎల్ ఎంప్లాయీస్​ తీసుకెళ్లాలి. రిపేర్​తర్వాత మళ్లీ తీసుకొచ్చి బిగించాలి. కానీ  రైతులతోనే  సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారు. ట్రాక్టర్, ఆటోలు కిరాయికి మాట్లాడుకుని వాటిని సెంటర్లకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కిరాయిలు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ రిపేర్, బిగించడం, రిపేర్ వద్ద రైతులు వెయిటింగ్​ చేసినప్పుడు టీ, టిఫిన్ల ఖర్చులు అన్ని కలిపి  ఒక్కో ట్రాన్స్​ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దాదాపు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు రైతులపై భారం పడుతుంది.

ఈ సారే ఎక్కువ ప్రాబ్లమ్స్​ వస్తున్నాయి
ఈ సారి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు ఎక్కువగా కాలిపోతున్నాయి. ఇందుకు గల కారణాలను లైన్లపై పరశీలన చేస్తున్నాం.  సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వెంటనే రిపేర్ చేసి ఇస్తున్నాం.   
- రమేశ్, టెక్నికల్ ఏఈ, కామారెడ్డి