
గత కొద్దిరోజుల క్రితమే తమిళనాడు, కేరళా తీరప్రాంతాల్లో ఉప్పెన బీభత్సం సృష్టించింది. మళ్లీ పశ్చిమ తీరానికి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషిన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో మే 4, 5 తేదీల్లో సముద్రం ఉప్పొంగవచ్చని హెచ్చరికలు చేసింది. సముద్రంలో 0.5 నుంచి1.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడి తీరాన్ని తాకవచ్చని INCOIS తెలిపింది.
ఈ రకమైన ఉప్పెనని స్థానికంగా కళ్లకడల్ అంటారు. కేరళా తీరంలో తెల్లవారుజామున 2. గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వాహణ అథారిటీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంప్పు తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రదేశానికి చేర్చాలని ప్రభుత్వ యంత్రాగం ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులు, పర్యాటకులు తీరంలోకి వెళ్లకూడదని సూచించారు. అటు దక్షిణ హిందూ మహాసముద్రంలో బలమైన గాలు వీచే అవకాశం ఉందని యూన్ ప్రపంచ వాతావరణ సంస్థ కూడా హెచ్చరించింది.