Immanuel: బిగ్‌బాస్ 9 టైటిల్ కళ్యాణ్‌ది.. ట్రెండింగ్ ఇమ్మాన్యుయేల్‌ది.. విన్నర్ రేంజ్‌లో భారీ రెమ్యూనరేషన్!

Immanuel: బిగ్‌బాస్ 9 టైటిల్ కళ్యాణ్‌ది.. ట్రెండింగ్ ఇమ్మాన్యుయేల్‌ది.. విన్నర్ రేంజ్‌లో భారీ రెమ్యూనరేషన్!

బిగ్‌బాస్ హౌస్‌లోకి 'అగ్నిపరీక్ష' ద్వారా కామనర్ కోటాలో అడుగుపెట్టిన ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీజన్-9 విజేతగా నిలిచారు. క్రమశిక్షణ, నిశ్శబ్ద పోరాటంతో ఆయన టైటిల్ గెలవగా.. నటి తనూజ రన్నరప్‌గా నిలిచారు. వీరిద్దరితో పాటు ఈ సీజన్‌లో తనదైన ముద్ర వేసి, "ప్రజల గుండెల్లో విజేత" (People's Winner) అనిపించుకున్న కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ అంటున్నారు అభిమానులు..  సోషల్ మీడియా వేదికగా అసలైన విజేత ఇమ్మూ అంటూ హోరెత్తిస్తున్నారు. 

నవ్వుల రారాజు.. ఆటలో పోరాట యోధుడు!

జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా పరిచయమైన ఇమ్మాన్యుయేల్, బిగ్‌బాస్ హౌస్‌లో కేవలం నవ్వులకే పరిమితం కాలేదు. 15 వారాల పాటు సాగిన తన ప్రయాణంలో ప్రతి ఎపిసోడ్‌లోనూ అత్యధిక స్క్రీన్ స్పేస్ సంపాదించుకున్న కంటెస్టెంట్ నిలిచారు. తనవారైనా సరే తప్పు చేస్తే నిలదీయడం, స్నేహానికి ప్రాణం ఇవ్వడం ఇమ్ము ప్రత్యేకత. అందుకే, ఆయన 4వ స్థానంలో  వెనుతిరిగినా, అభిమానులు మాత్రం ఆయనే ఈ సీజన్ రియల్ విన్నర్ అని పోస్టులు పెడుతున్నారు. ఇమ్మూ కనీసం మూడవ స్థానంలో అయినా ఉంటారని ఆశించారు. కానీ 4వ స్థానం ఆయన అభిమానులను నిరాశ పరిచింది. కమెడియన్‌గా వచ్చి హీరోగా నిలిచావు అని బిగ్ బాస్ కూడా ప్రశంసించడం ఇమ్ము సాధించిన అతిపెద్ద విజయం అంటున్నారు నెటిజన్లు.

రెమ్యూనరేషన్ లోనూ టాప్!

సోషల్ మీడియా, ఇండస్ట్రీ వర్గాల ఉన్న సమాచారం ప్రకారం..  ఇమ్మాన్యుయేల్ ఈ సీజన్‌లో భారీగానే సంపాదించారని తెలుస్తోంది. ఇమ్ము వారానికి సుమారు రూ. 2.6 లక్షలు రెమ్యూనరేషన్ ఉంటుందని టాక్. ఈ లెక్కన 15 వారాలకు గానూ దాదాపు రూ. 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. ప్రైజ్ మనీ గెలవకపోయినా, ఈ సీజన్‌లో అత్యధిక ఆదాయం పొందిన టాప్ కంటెస్టెంట్లలో ఇమ్ము ఒకరిగా నిలిచారు.

 

 

విజేత కళ్యాణ్.. !

మరోవైపు కళ్యాణ్ పడాల గెలుపు ఒక చరిత్ర అనే చెప్పాలి. విజేతగా రూ. 35 లక్షల నగదు అందుకున్నారు. దీనితో పాటు మారుతీ సుజుకీ విక్టోరిస్ కారు, అదనంగా స్పాన్సర్ల నుండి నగదు బహుమతులు అందుకున్నారు.  వారానికి రూ. 2 లక్షల చొప్పున 15 వారాలకు రూ. 30 లక్షలు. వెరసి కళ్యాణ్ సుమారు రూ. 65 లక్షలకు పైగా ఆదాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు.  డీమాన్ పవన్ రూ. 15 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో ప్రైజ్ మనీ తగ్గింది

కళ్యాణ్ విజయం ఒక క్రమశిక్షణకు నిదర్శనం అయితే, తనూజ పోరాటం ఒక ధైర్యానికి సంకేతం. కానీ, ఇమ్మాన్యుయేల్ అందించిన వినోదం మాత్రం ఈ సీజన్‌ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. ట్రోఫీ ఎవరు గెలిచినా.. 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించడంలో వీరు నూటికి నూరు శాతం విజయం సాధించారు.